హీరోగా శ్రీనివాస్ రెడ్డి కొత్త సినిమా వివరాలు


కమీడియన్ గ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి రెండేళ్ళ కిందట నుండి హీరోగా కూడా చేస్తున్నాడు. ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ సినిమాతో తో పూర్తి హీరోగా మారాడు. గతంలో వచ్చిన గీతాంజలి అనే హారర్ కామిడీలో నటించి మెప్పించాడు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి హీరోగా మరో రొమాంటిక్ కామిడీ సినిమా ఒకటి మొదలుకాబోతుంది.

సుమంత్ అశ్విన్ తో ‘రైట్ రైట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా కు సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతుంది. గోపి సుందర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రంతో మరో విజయం తన ఖాతాలో వేసుకుంటాడని ఆశిద్దాం.