ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ !

11th, December 2017 - 12:14:40 PM

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కమెడియన్ విజయ్ ఈరోజు ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ తర్వాత ‘బొమ్మరిల్లు, ధనలక్ష్మి తలుపుతడితే, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, పార్టీ’ వంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

కారణాలు తెలియరాలేదు కానీ ఈరోజు ఉదయం యూసఫ్ గూడలో ఉన్న తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు విస్మయాన్ని వ్యక్తం చేశారు.