యాక్షన్ ఎంటర్ టైనర్ లో కామెడీ టచ్ !

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న విషయం తెలిసందే. అయితే గోపీచంద్ కోసం సంపంత్ నంది యాక్షన్ ఎంటర్ టైనర్ లో మంచి కామెడీ టచ్ ని కూడా ఇచ్చారట. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందించ‌నున్నాడు.

బెంగాల్ టైట‌ర్‌ నిర్మించిన నిర్మాత కె.కె.రాధామోహ‌నే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపంత్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి సంపత్, గోపీచంద్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version