పవన్ – త్రివిక్రమ్ ల సినిమాలో హైలెట్ కానున్న కామెడీ !

23rd, April 2017 - 09:22:45 AM


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పవన్ అభిమానవుల్లోనే కాక సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఆ అంచనాలను అందుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారట. తాజాగా చిత్ర సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుందట.

అది కూడా ప్రముఖ తారాగణం పవన్, మురళి శర్మ, రావు రమేష్ ల మధ్య కావడం విశేషం. గతంలో పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కూడా కామెడీ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఆ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ కూడా ఒక ప్రధాన కారణం. అందుకే ప్రస్తుత చిత్రంలో కూడా అలాంటి కామెడీ ట్రాక్ ఉండేలా చూస్తున్నాడట త్రివిక్రమ్. ఇకపోతే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.