యంగ్ స్టార్ హీరో పై కేసు నమోదు !

Published on Jan 2, 2022 10:26 pm IST

బాలీవుడ్‌ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ పై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌ కు చెందిన జైసింగ్‌ అనే వ్యక్తి విక్కీ కౌశల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. విక్కీ కౌశల్‌ తన అనుమతి లేకుండా తన ద్విచక్ర వాహన నంబర్‌ ని వాడుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు. విక్కీ కౌశల్‌ తన తదుపరి సినిమాలో వాడిన ఓ బైక్ నంబర్‌ జైసింగ్‌ అనే వ్యక్తిది అట.

అందుకే, జైసింగ్‌ తన బైక్ నంబర్ ఉపయోగించారని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా జైసింగ్‌ మాట్లాడుతూ.. ‘విక్కీ కౌశల్‌ కొత్త చిత్రంలో ఆయన నడిపే బైక్ కి ఉన్న నంబర్ నాదే. నా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నా నంబర్‌ వాళ్లు వాడటం చట్ట వ్యతిరేకం. అందుకే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ జైసింగ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా విక్కీ కౌశల్‌ ప్రస్తుతం సారా అలీఖాన్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో శరవేగంగా జరుగుతోంది.

సంబంధిత సమాచారం :