‘డీజే’ పై మంత్రికి కంప్లైంట్


అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రం జూన్ 23 న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదలకు 10 రోజుల సమయమే ఉన్నా ఈ చిత్రాన్ని వివాదాలు వీడడం లేదు. డీజే లోని ‘గుడిలో బడిలో మడిలో’ అంటూ సాగే పాట విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ పాటలో అభ్యంతరకర పదాలు వాడారని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు అంటున్నారు.

ఇప్పటికే వీరు చిత్ర యూనిట్ ని ఆ పదాలు తొలిగించాలని కోరారు. తాము ఎంత చెప్పినా ఆ పదాలను తొలగించ లేదని వారు చెబుతున్నారు. దీనితో నేడు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలసి డీజే చిత్రంపై కంప్లైంట్ చేశారు. ఆ పాటలో అభ్యంతరకరంగా ఉన్న నమకం, చమకం అనే పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మంత్రిని కోరారు.హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆ పాటలో పదాలు వాడారనేది వారి వాదన.