బాలయ్య యూఎస్ టూర్ పూర్తి వివరాలు..!

బాలయ్య యూఎస్ టూర్ పూర్తి వివరాలు..!

Published on Jan 18, 2017 1:37 PM IST

GPSK
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సినిమా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

తెలుగు సినిమాకు ఈమధ్య కాలంలో పెద్ద మార్కెట్‌గా అవతరించిన యూఎస్‌లోనూ గౌతమిపుత్ర శాతకర్ణి వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. సాధారణంగా యూఎస్‌లో బాలయ్య సినిమాలు ఇప్పటివరకూ పెద్దగా సందడి చేసింది లేదు. కాగా గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం అందుకు భిన్నంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి 1.5 మిలియన్ డాలర్ మార్క్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచనతో బాలకృష్ణ యూఎస్ టూర్‌కు వెళ్ళనున్నారు. గురువారం సాయంత్రం నుంచి బాలయ్య ఈ టూర్ మొదలుపెట్టనున్నారు.

బాలకృష్ణ యూఎస్ టూర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి :

ముందుగా జనవరి 18న సాయంత్రం 9:50కి బాలయ్య హైద్రాబాద్‌ నుంచి సాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతారు. అక్కడ జనవరి 19న ఉదయం 6:40కి ల్యాండ్ అయిన తర్వాత నాలుగు రోజుల పాటు ప్రధాన నగరాలలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షోస్ ప్రదర్శితమయ్యే థియేటర్లను సందర్శించి తిరిగి జనవరి 23న రాత్రి 11 గంటలకు న్యూయార్క్ నుంచి హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఈ షెడ్యూల్‌లో మొదట గురువారం (జనవరి 19) రోజున బే ఏరియాలో సెర్రా థియేటర్స్‌లో ప్రదర్శితమయ్యే సాయంకాలం షోస్‌కు బాలయ్య హాజరవుతారు. థియేటర్స్ సందర్శించిన తర్వాత ఆ రోజు బే ఏరియాలోని బస చేస్తారు.

ఇక ఆ తర్వాత రోజైన శుక్రవారం (జనవరి 20) సాన్ ఫ్రాన్సిస్కో నుంచి డల్లాస్‌కు బయలుదేరతారు. డల్లాస్‌లో సాయంత్రం 4:30కు ల్యాండ్ అక్కడి సినీమార్క్ వెబ్ చప్పెల్‌లోని షోస్‌కు హాజరవుతారు. ఇక ఆరోజు డల్లాస్‌లోనే బాలయ్య స్టేకు ఏర్పాట్లు చేశారు.

శనివారం (జనవరి 21) రోజున డల్లాస్ నుంచి డెట్రాయిట్‍కు బయలుదేరతారు. డెట్రాయిట్‌లో సాయంత్రం 3 గంటలకు ల్యాండ్ అయ్యాక, అక్కడి ఏఎమ్‌సీ సౌత్‌ఫీల్డ్‌లోని షోస్‌కు హాజరవుతారు. ఆ రాత్రికి బాలయ్య డెట్రాయిట్‌లోనే స్టే చేస్తారు.

ఇక చివరి రోజైన ఆదివారం (జనవరి 22) ఉదయమే డెట్రాయిట్ నుంచి న్యూజెర్సీకి బయలుదేరతారు. మధ్యాహ్నం 1 గంటకు న్యూజెర్సీలో ల్యాండ్ అయ్యాక, అక్కడి బిగ్ సినిమాస్ ఎడిసన్‌లో ప్రదర్శితమయ్యే మూడు షోస్‌కు హాజరవుతారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేసి, తిరిగి సోమవారం రోజున రాత్రి 11 గంటలకు న్యూయార్క్ నుంచి హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

(పైన చెప్పిన టైమింగ్స్ అన్నీ అమెరికాలోని ఆయా ప్రాంతాల స్థానిక కాలమానం ప్రకారంగా ఉన్నాయని గమనించగలరు).

సంబంధిత సమాచారం

తాజా వార్తలు