పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతేడాది ‘దే కాల్ హిమ్ OG’ అనే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అయితే, పవన్ కళ్యాణ్‌కు ‘పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ బ్యానర్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ భారీ అప్డేట్ ఉంటుందని అభిమానులకు టీజ్ చేసింది. చెప్పినట్లే కొద్దిసేపటి క్రితం ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మార్షల్ ఆర్ట్స్ అంశాలు, జపాన్ మార్షల్ ఆర్ట్స్ సంస్కృతి ప్రభావం స్పష్టంగా కనిపించాయి.
అయితే ఈ కాన్సెప్ట్ వీడియో అసలు ఏ ప్రాజెక్ట్‌కు సంబంధించినదో స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ వీడియో వెనుక నిర్మాణ సంస్థ ఏం ప్లాన్ చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇక నటుడిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమ్మర్ 2026లో విడుదల కానుంది.
It Begins !!#PawanKalyanCreativeWorks pic.twitter.com/shEBromdRO
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 6, 2026
