కన్ఫర్మ్..”ఆచార్య” మెగా మాస్ ట్రీట్ ఇలా కూడా ఉండబోతుంది.!

Published on Apr 10, 2022 6:02 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మరియు మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ని ఈ ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఇంకో క్రేజీ అనౌన్సమెంట్ ని ఈ చిత్రం నుంచి అందించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ థియేటర్స్ లో కూడా ఉండొచ్చని టాక్ ఉండగా ఇప్పుడు దీనిని నిజం చేస్తూ మేకర్స్ ఈ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని అందించారు.

ఈ సినిమా ట్రైలర్ ని థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయబోతున్నామని ఇది ఈ ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి ఉండనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా థియేటర్స్ లిస్ట్ ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఇక మెగా యుఫోరియా ఆరోజు వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :