కన్ఫర్మ్..మళ్ళీ రిపీట్ కాబోతున్న బన్నీ ఊర మాస్ కాంబో!

Published on Oct 15, 2021 12:00 pm IST

అప్పుడు వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ లో ఉన్న బన్నీ క్రేజ్ ను మాస్ లో విపరీతంగా పెంచిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “సరైనోడు” సినిమానే అని చెప్పాలి. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బన్నీ అభిమానులను ఇప్పటికీ కూడా చూసిన ప్రతీ సారి మంచి కిక్ ఇస్తుంది.

మరి అలా కంప్లీట్ గా ఊరమాస్ బన్నీని చూపించిన బోయ మళ్ళీ బన్నీతో ఓ సాలిడ్ సినిమా చేయనున్నాడని ఎప్పుడు నుంచో టాక్ ఉండగా దీనిపై ఇప్పుడు అధికారిక క్లారిటీ వచ్చేసింది. దీనిని స్వయంగా బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ నే నిన్న తెలిపారు.

తమ స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో బాలయ్యతో ఒక స్పెషల్ షో లాంచ్ కార్యక్రమంలో నిన్న ఈ విషయాన్ని తెలిపారు. దీనితో మళ్ళీ వీరి ఊర మాస్ కాంబో రిపీట్ అవ్వనుంది అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More