కన్ఫర్మ్..హాలీవుడ్ లో కూడా “ఆదిపురుష్” రిలీజ్ అవుతుంది.!

కన్ఫర్మ్..హాలీవుడ్ లో కూడా “ఆదిపురుష్” రిలీజ్ అవుతుంది.!

Published on Jun 29, 2022 12:01 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగుకి కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి కూడా లాక్ అయ్యి ఉన్న లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా వస్తుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ పై గత కొన్నాళ్ల నుంచి పలు వార్తలు హాట్ టాపిక్ గా వినిపించాయి.

ఈ చిత్రం పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది అని గట్టి బజ్ వినిపించగా ఇపుడు ఈ వార్త కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ ఐ=విషయాన్ని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారే రివీల్ చేయడం జరిగింది. తాను మాట్లాడుతూ ప్రభాస్ ని హాలీవుడ్ కి ఆదిపురుష్ తో పరిచయం చేస్తున్నామని ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుంది అని తెలిపారు. దీనితో ఈ బిగ్ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు