కన్ఫర్మ్..”రాధే శ్యామ్” నుంచి రెండో ట్రైలర్ ప్లేస్ లో ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్..!

Published on Mar 1, 2022 3:09 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కి సిద్ధం చేయగా ఇప్పుడు ఒక్కో డేట్ మారుతున్న కొద్దీ అంతకంతకు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళ్తున్నాయి.

ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఈ సినిమాపై హైప్ ని మరింత పెంచేలా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ వార్త అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో ట్రైలర్ ప్లేస్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రడక్షన్ క్లిప్ ని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారు. అంటే ఈ సినిమాలో స్టార్టింగ్ ఇంట్రో క్లిప్ ని ఒక రెండు నిమిషాల నిడివి లోపు ఉండేదాన్ని రిలీజ్ చేస్తున్నారట. ఇది ఒకింత ఆసక్తిగా ఉందని చెప్పాలి. మరి ఈ ఇది చూసాక ఎన్ని అంచనాలు పెరుగుతాయో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :