కన్ఫర్మ్ : నాగచైతన్య నెక్స్ట్ మూవీ నిర్మించనున్న యంగ్ ప్రొడ్యూసర్

Published on May 27, 2023 6:04 pm IST

ఇటీవల కస్టడీ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు అక్కినేని నాగ చైతన్య. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. అయితే కస్టడీ మూవీ రిలీజ్ తరువాత పర్వాలేదనిపంచే విజయాన్ని మాత్రమే అందుకుంది. కాగా నాగ చైతన్య నెక్స్ట్ ఎవరితో మూవీ చేస్తారు అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తికరంగా మారింది.

ఇక తాజాగా గీత ఆర్ట్స్ 2 అధినేత బన్నీ వాస్ ఒక భారీ మూవీని నాగచైతన్యతో నిర్మిచనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకుడా అని అడిగిన ప్రశ్నకు బన్నీ వాస్ సమాధానమిస్తూ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

మొత్తంగా అయితే ఈ వార్త అక్కినేని అభిమానులను మంచి న్యూస్ అని చెప్పాలి. నిజానికి వీరి కాంబో మూవీ పై 2018 లోనే వార్తలు రాగా ఫైనల్ గా ఇప్పుడు ఈ మూవీ సెట్ అయింది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా గతంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగచైతన్య, తమన్నా నటించిన 100 % లవ్ మూవీ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :