తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన కాంట్రవర్శియల్ డైరెక్టర్

Published on Sep 18, 2023 7:30 pm IST

కేజీఎఫ్ సిరీస్ చిత్రాల పై చేసిన వ్యాఖ్యలతో డైరెక్టర్ వెంకటేష్ మహా పెద్ద దుమారాన్నే రేపారు. యాంగర్ టేల్స్ మరియు ఉస్తాద్‌లో నటుడు గా ఆకట్టుకున్నారు. అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా తన నెక్స్ట్ సినిమా ను అనౌన్స్ చేశారు. ఈ పవిత్రమైన రోజున వెంకటేష్ మహా తన రాబోయే చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోస్టర్‌ని బట్టి చూస్తే, ఈ చిత్రం రాజకీయాలు మరియు దానితో పాటు నాటకీయంగా సాగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి.

YNOT స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్టైన్మెంట్‌, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తారాగణం మరియు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :