పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మాస్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ గబ్బర్ సింగ్ కలయిక ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ రిలీజ్ కి ముందు ఒక ఊహించని ఘటన హరీష్ వైపు నుంచి చోటు చేసుకుంది. అది నిజమో కాదో కానీ తన రిప్లై అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఒక స్టార్ హీరో హైయెస్ట్ లేపాలి అంటూ మరో స్టార్ హీరో అభిమాని సోషల్ మీడియాలో ఉస్తాద్ సాంగ్ తో చెప్తే దానికి హరీష్ శంకర్ ‘తథాస్తు’ అంటూ అభయహస్తం ఇవ్వడం ఆ సదరు హీరో అభిమానులని ఎంతగానో హర్ట్ చేసింది అంటున్నారు. అయితే ఇప్పుడు హరీష్ రిప్లై లాంటివి ఏమీ కనిపించడం లేదు కానీ ఊహించని రీతిలో వైరల్ గా మారిన ఈ సెన్సిటివ్ అంశంపై హరీష్ శంకర్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
