ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ది కేరళ స్టోరీ 2’.. ఎప్పుడు? ఎందులో అంటే!

The-Kerala-Story-2

బాలీవుడ్ నుంచి కొన్నాళ్ల కితం వచ్చిన కాంట్రవర్సియల్ హిట్ చిత్రాల్లో ది కేరళ స్టోరీ కూడా ఒకటి. ఆదా శర్మ, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమా సంచలనం సెట్ చేసింది. అయితే దీనికి కొనసాగింపుగా వచ్చిన పార్ట్ 2 దాని రేంజ్ లో వసూళ్లు రాబట్టలేదు కానీ దీనికి కూడా మంచి రీచ్ అందుకుంది.

ఇక ఈ సినిమాని కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా ఈ చిత్రం ఎట్టకేలకి ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమాని కూడా పార్ట్ 1 సొంతం చేసుకున్న జీ 5 వారు సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో ఈ మే 8 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఒరిజినల్ హిందీ వెర్షన్ తో పాటుగా డబ్బింగ్ తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో అదితి భార్య, ఉల్కా గుప్తా అలాగే ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు.

Exit mobile version