జీ 5 లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తున్న ‘విడుతలై 1’

Published on Jun 8, 2023 1:00 am IST

హృద్యమైన సినిమాల దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన తాజా సినిమా విడుతలై పార్ట్ 1 ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ పోలీసు డ్రామా మూవీలో సూరి ప్రధాన పాత్రలో నటించారు. థియేట్రికల్ రన్ తర్వాత, ఈ సినిమా ఇటీవల జీ 5 ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చింది. కాగా మేకర్స్ ఓటిటి వెర్షన్‌లో డైరెక్టర్స్ కట్‌ని అదనంగా చేర్చారు. ఇక జీ 5 ప్లాట్‌ఫారమ్ నుండి తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ సినిమా 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటి దూసుకెళుతోంది వారు ప్రకటించారు.

ఇది నిజంగా అద్భుతం అని, అలానే రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింత మంది ఆదరణని పొందుతుందని జీ 5 వారు భావిస్తున్నారు. ఇక విషయం ఏమిటంటే, ఈ సినిమా తెలుగులో విడుదల పేరుతో కూడా విడుదలై మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. కాగా విడుతలై పార్ట్ 2 ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి రానుంది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భవానీ శ్రీ కథానాయికగా నటించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇళవరసు ఇతర కీలక పాత్రలు పోషించారు. వెట్రిమారన్ ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు నటీనటుల సహజ నటన విడుతలై 1 మూవీకి ఇంత గొప్ప ఆదరణ తెచ్చిపెడుతోందని అంటున్నాయి సినీ వర్గాలు.

సంబంధిత సమాచారం :