ట్రెండింగ్ : ఢిల్లీ, రోలెక్స్ లకు గిఫ్టులుగా డైమండ్ బ్రాస్‌లెట్స్

Published on Aug 18, 2022 12:00 am IST

లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ లో ఢిల్లీ క్యారెక్టర్ లో సూపర్ గా పెర్ఫార్మ్ చేసి అందరి నుండి మంచి పేరు అనుకున్నారు కార్తీ. ఇక ఇటీవల కమల్ హాసన్ తో లోకేష్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ లో రోలెక్స్ అనే క్యారెక్టర్ లో కనిపించి సూపర్ గా క్రేజ్ అందుకున్నారు సూర్య. ఇక రాబోయే లోకేష్ మల్టివర్స్ మూవీస్ లో వీరిద్దరూ కలిసి నటించే ఛాన్స్ ఉంది. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా కార్తీ హీరోగా నటించిన విరుమాన్ మూవీని సూర్య ఎంతో భారీగా నిర్మించారు.

మొన్న మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాగా టాక్ ని సొంతం చేసుకుని థియేటర్స్ లో దూసుకెళుతుండడంతో యూనిట్ నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా మూవీ సక్సెస్ సాధించడంతో తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ సూర్య, కార్తీ లతో పాటు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సీఈవో, విరుమన్‌ సహనిర్మాత అయిన రాజశేఖర్‌ పాండియన్‌కు డైమండ్‌ బ్రాస్‌లెట్స్ ని అలాగే దర్శకుడు ముత్తయ్యకు వజ్రపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చారు. కాగా ఈ వండర్ఫుల్ మూమెంట్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

సంబంధిత సమాచారం :