రాధిక, శరత్ కుమార్ లపై అరెస్ట్ వారెంట్.

radika sharat

నటుడు శరత్‌కుమార్, ఆయన భార్య రాధికలను అరెస్ట్‌ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే నటుడు శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్, మరొక నిర్మాత లిస్టిన్‌ స్టీఫెన్‌ కలిసి ఇంతకు ముందు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్‌ మీడియా సంస్థ నుంచి తీసుకున్న రుణం రూ.2 కోట్లకుగానూ చెక్కును ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్‌ అయ్యింది.

దీంతో ఆ రేడియన్స్‌ మీడియా సంస్థ తరఫున శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్‌ స్టీఫెన్‌లపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిపై స్పందించిన సైదాపేట కోర్టు ఆ ముగ్గురిని అరెస్ట్ చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.

Exit mobile version