క్రేజీ..”ఆదిపురుష్” నుంచి ఊహాతీతంగా ప్రభాస్ రామావతార ఫస్ట్ లుక్స్.!

Published on Sep 30, 2022 7:21 am IST

ఇండియన్ సినిమా దగ్గర ఎప్పుడు నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి సినిమా ఏదన్నా ఉంది అది డెఫినెట్ గా “ఆదిపురుష్” చిత్రమే అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన భారీ ఇతిహాస చిత్రం ఇది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటించగా కృతి సనన్ జానకీ దేవిగా నటించింది.

అయితే ఈ చిత్రం విషయంలో అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా ఈ అక్టోబర్ లో ఈ అప్డేట్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ మళ్ళీ నిన్ననే ఓ అప్డేట్ ముందే వస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ అప్డేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రభాస్ ని శ్రీరామునిగా రివీల్ చేస్తూ డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా ఊహాతీతంగా ఉందని చెప్పాలి.

చేతిలో విల్లు నేరుగా ఆకాశానికి ఎక్కు పెట్టి గ్రాండ్ విజువల్స్ తో ఈ పోస్టర్ కనిపిస్తుంది. మొత్తానికి అయితే డెఫినెట్ గా ఈ ఫస్ట్ లుక్ మాత్రం అంచనాలు అందుకుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి భూషణ్ కుమార్ సహా ఓంరౌత్ లు నిర్మాణం వహించగా ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ని అయితే వచ్చే ఏడాది జనవరి 12న పాన్ వరల్డ్ లెవెల్లో 3D లో జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం :