మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీగా సెన్సేషనల్ రూమర్స్.!

Published on Sep 25, 2022 4:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ లో మొదటి హ్యాట్రిక్ సినిమా ఓ దర్శకునితో చేస్తుండగా ఈ సినిమాపై అయితే పాన్ ఇండియా లెవెల్లో కూడా క్రేజీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి పక్కన పెడితే దీనికి మించి భారీ స్థాయి అంచనాలు మహేష్ బాబు నెక్స్ట్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో చేయబోయే సినిమాపై నెలకొన్నాయి. జస్ట్ ఈ సినిమాపై ఏ చిన్న బజ్ బయటకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో యిట్టె సెన్సషనల్ అయ్యిపోతుంది.

తాజాగా రాజమౌళి ఈ సినిమా జానర్ ని విశదీకరించడం అలాగే హాలీవుడ్ ఏజెన్సీ తో తాను డీల్ కుదుర్చుకోవడం వంటివి ఈ కాంబోపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇంకా లేటెస్ట్ గా అయితే ఓ ప్రముఖ హాలీవుడ్ స్టార్ కూడా ఈ సినిమాలో క్యామియో కి కనిపిస్తారని ఓ సీనియర్ హాలీవుడ్ నటుడు ఉన్నాడని మరికొన్ని కూడా కొన్ని షాకింగ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే వీటిలో ప్రస్తుతనానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఇలా మొత్తానికి అయితే పలు క్రేజీ రూమర్స్ సినిమాపై మరింత స్థాయి అంచనాలు పెంచుతున్నాయి.

సంబంధిత సమాచారం :