లేటెస్ట్..”భోళా శంకర్” ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అనౌన్సమెంట్.!

Published on Jun 1, 2023 11:14 am IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “భోళా శంకర్” కోసం తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే మేకర్స్ ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ అప్డేట్ అందించగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అనౌన్సమెంట్ ని అయితే ఇచ్చేసారు.

మరి మెగాస్టార్ పై సూపర్ పోస్టర్ తో ఫస్ట్ సింగిల్ ‘భోళా మ్యానియా’ ని అయితే రిలీజ్ చేయడానికి డేట్ లాక్ చేసారు. మరి ఈ సాంగ్ ప్రోమో అయితే రేపు జూన్ 2న రిలీజ్ చేస్తుండగా జూన్ 4 న ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. మరి మణిశర్మ తనయుడు మహతి సాగర్ పై కూడా మంచి అంచనాలు మెగా ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఇక ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో. ఇక ఏకే ఎంటర్టైమెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఆగస్ట్ 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :