మహేష్ సినిమాలో క్రేజీ బ్యూటీ ?

Published on Sep 7, 2021 12:14 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ‘నభా నటేష్‌’ నటించబోతుంది అని తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉందట.

ఎలాగూ మహేష్ – త్రివిక్రమ్ ది క్రేజీ కాంబో… మరి వీరి కలయికలో రానున్న సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్ గా సక్సెస్ అయితే , ఇక ఆమెకు డిమాండ్ క్రియేట్ అవుతుంది. కాగా పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :