క్రేజీ..మహేష్ ని ఫాలో అవుతున్న బిల్ గేట్స్..!

Published on Jul 1, 2022 7:07 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇంటర్నేషనల్ లెవెల్ రీచ్ ఉంటుంది అని వారి అభిమానుల్లో మాత్రమే కాకుండా జెనరల్ ఆడియెన్స్ లో కూడా ఉన్న మాట. మహేష్ నుంచి పాన్ ఇండియన్ అంతెందుకు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇంకా సినిమాల పరంగా మహేష్ రీచ్ ని అందాక పక్కన పెడితే రీసెంట్ గా మాత్రం ఇంటర్నేషనల్ వైడ్ మహేష్ పేరు వినిపిస్తోంది.

తాజాగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ని మహేష్ బాబు మరియు నమ్రతలు కలవడం ఓ పోస్ట్ పెట్టడం పైగా నిన్న రాత్రి బిల్ గేట్స్ కూడా ఈ మీటింగ్ పై ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి వీటి కన్నా క్రేజీ అంశం ఏమైనా ఉంది అంటే మహేష్ బాబుని సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. దీనితో ఈ అంశం ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం అయితే ఈ జూలై నెలలో మహేష్ రిటర్న్ అవుతుండగా త్రివిక్రమ్ తో సినిమాలో పాల్గొననున్నారు.

సంబంధిత సమాచారం :