క్రేజీ రూమర్: ‘ప్యారడైజ్’లో పాపులర్ నటుడు కామియో!?

మరి కొన్ని గంటల్లో తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంగ్ అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్ గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. ఆల్రెడీ నాచురల్ స్టార్ నాని టైర్ 1 స్టార్ హీరోస్ లెవెల్లో రికార్డులు కూడా సెట్ చేయడం మొదలు పెట్టాడు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసే సర్ప్రైజ్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సాలిడ్ తారగణంతో ప్యారడైజ్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

కానీ మనకి ఆల్రెడీ తెలిసిన నటులు కాకుండా ఓ సర్ప్రైజింగ్ రోల్ లో పాపులర్ నటుడు సెకండాఫ్ లో కనిపించనున్నటు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ నటుడు ఎవరు ఏంటి అనేది థియేటర్ లోనే తెలియాల్సి ఉంది. సో మొత్తానికి మాత్రం ఓ ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా ప్యారడైజ్ రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ ను నిర్మాణం వహించారు.

Exit mobile version