క్రేజీ బజ్ : స్టార్ తమిళ్ డైరెక్టర్ తో మూవీ చేయనున్న అల్లు అర్జున్ ?

Published on Sep 21, 2023 12:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తీస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న దీని పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్న పుష్ప 2 లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది. ఇక దీని అనంతరం మరోవైపు హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ తో ఒక సినిమా అలానే టి సిరీస్ సంస్థ పై సందీప్ రెడ్డి వంగా నిర్మించనున్న మరొక సినిమా కూడా ఒప్పుకున్నారు అల్లు అర్జున్. అయితే పుష్ప 2 తరువాత వెంటనే త్రివిక్రమ్ మూవీ, ఆపైన సందీప్ రెడ్డి మూవీ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ వంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తాజాగా హైదరాబాద్ విచ్చేసి హీరో అల్లు అర్జున్ ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించగా అది ఆయనకు ఎంతో నచ్చిందట. ప్రస్తుతం నెల్సన్ ఆ స్టోరీ యొక్క పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారని, అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో వీరిద్దరి క్రేజీ కాంబో మూవీ అనౌన్స్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :