బజ్..చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయ్యిన అనిరుద్..?

Published on Jun 3, 2022 10:00 am IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం తో మళ్ళీ హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత ఇప్పుడు మరో పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. అలాగే దీని తర్వాత టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరి భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా క్రేజీ లైనప్ తప్ పాన్ ఇండియా లెవెల్లో తన రీచ్ ని మరో లెవెల్లో సెట్ చేస్తున్న చరణ్ తిన్ననూరి సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి గాను సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీత దర్శకుడిగా లాక్ అయ్యినట్టు ఇప్పుడు తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ అప్డేట్ కూడా కన్ఫర్మ్ అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :