క్రేజీ బజ్..లోకేష్ కనగ్ రాజ్ తో సూపర్ స్టార్..?

Published on Feb 16, 2023 4:00 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర తన సినిమాలతో మూవీ లవర్స్ లో మంచి ముద్ర వేసుకున్న టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగ్ రాజ్. తన సినిమాలతో సాలిడ్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్న ప్రతి సినిమా కూడా సాలిడ్ హైప్ ని సెట్ చేసుకుంటుండగా ఇప్పుడు దళపతి విజయ్ తో అయితే లోకేష్ “లియో” అనే సినిమా చేస్తున్నాడు.

ఇక లోకేష్ కనగ్ రాజ్ దీని తర్వాత మరో ఆరేళ్ళ పాటుగా ఫుల్ బిజీ గా ఉండనుండగా వీటిలో “విక్రమ్ 2”, “ఖైదీ 2” కూడా ఉన్నాయి. అయితే తమిళ నాట సీనియర్ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ తో వర్క్ చేసిన తాను నెక్స్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో వర్క్ చేస్తే చూడాలని ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

మరి ఫైనల్ గా ఈ సెన్సేషనల్ అవైటెడ్ కాంబో ఓకే అయ్యేలా ఉందని క్రేజీ బజ్ తెలుస్తుంది. రజిని రిక్వెస్ట్ మేరకు ఈ సినిమా లియో తర్వాత విక్రమ్ 2 కన్నా ముందు ఉంటుంది అని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కాంబో కోసం అయితే చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు ఓకే అయ్యింది అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :