క్రేజీ బజ్..”రాధే శ్యామ్” కోసం మహేష్ బాబు.?

Published on Feb 23, 2022 8:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీ అవ్వనుంది.

అయితే ఈ సినిమాకి మేకర్స్ ఎన్ని ప్లాన్స్ వేసారో చూస్తూనే ఉన్నాము. అలానే ఇప్పుడు కూడా ఇంకో క్రేజీ ప్లానింగ్ వేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కి గాను కథ చెప్పడానికి బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్ తన వాయిస్ ఓవర్ ని ఇవ్వనున్నట్టు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

మరి అలాగే ఇప్పుడు తెలుగు వెర్షన్ కి గాను మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన గొంతు అందివ్వనున్నట్టుగా ఇప్పుడు క్రేజీ బజ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కూడా ఏమన్నా అధికారిక క్లారిటీ వస్తుందా లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :