క్రేజీ బజ్..దళపతి విజయ్ ఈ సినిమాలో మహేష్ బాబు..?

Published on Jun 8, 2022 7:01 am IST


ప్రస్తుతం దాదాపు మన దక్షిణాది సినిమా నుంచి అనేక మల్టీస్టారర్ సినిమాలు పడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాము. దీనితో కొన్ని డ్రీమ్ కాంబినేషన్స్ కూడా పడుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా పలు భారీ సినిమాల్లో అయితే కొందరు బిగ్ స్టార్స్ చిన్న క్యామియో రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాగే మరో సెన్సేషనల్ మల్టీస్టారర్ లాంటి ట్రీట్ ఇప్పుడు పడనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

మరి ఆ కాంబో కూడా ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ మరియు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ల కాంబినేషన్లో అట. అయితే ఈ ఇద్దరికీ భారీ ఎత్తున ఫాలోయింగ్ తో పాటు ఇద్దరిని కలిపి అభిమానించే వారు కూడా మన తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఎక్కువే. మరి ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ని దర్శకుడు వంశీ పైడిపల్లి సెట్ చేస్తున్నట్టుగా క్రేజీ బజ్ వినిపిస్తుంది.

ప్రస్తుతం విజయ్ చేస్తున్న తన 66వ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది. మరి ఇందులో మహేష్ ఒక చిన్న కామియో లో కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :