పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సినిమా రాకా కోసం తెలిసిందే. ఇటీవల వచ్చిన షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సాలిడ్ హైప్ ని సెట్ చేసింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊహించని మేకోవర్ లో కనిపించడంతో ఒక సాహసోపేత పాత్రని తను చేస్తున్నట్టు అర్ధం అయ్యింది. ఇదిలా ఉండగా ఈ సినిమా కథ పరంగా ఓ క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది.
దీని ప్రకారం అట్లీ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో పాటుగా మైథాలజీ టచ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తోడేళ్ళుకి సంబంధించి పురాణాల్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ సినిమా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ రెండు అట్లీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే మాత్రం ఆడియెన్స్ కి మరో సాలిడ్ ట్రీట్ అందించినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
