“ఆదిపురుష్” రెండో ట్రైలర్ పై క్రేజీ బజ్.!

Published on Jun 3, 2023 7:06 am IST

ప్రస్తుతం ఇండియా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన ఈ మాసివ్ విజువల్ వండర్ రామాయణం ఆధారంగా అయితే తెరకెక్కింది. మరి ఈ సినిమాపై ఒక్కసారిగా ఇంత హైప్ రావడానికి కారణం ఈ సినిమా మొదటి ట్రైలర్ అని అందరికీ తెలిసిందే.

ప్రభాస్ ని, విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ తో ఒక్కసారిగా అంతా మారిపోయింది. దీనితో అక్కడ నుంచి సెన్సేషనల్ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి రెండో ట్రైలర్ కూడా ఉందని టాక్ వచ్చింది. ఇక దీనిపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ ట్రైలర్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ఈ భారీ సినిమా ఈ జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :