“బ్రహ్మాస్త్ర 2” లో రాకింగ్ స్టార్ పై క్లారిటీ.!

“బ్రహ్మాస్త్ర 2” లో రాకింగ్ స్టార్ పై క్లారిటీ.!

Published on Oct 29, 2022 8:59 AM IST

ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాల్లో బాలీవుడ్ అవైటెడ్ చిత్రం “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. మరి బ్రహ్మాస్త్ర చిత్రంలో బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు హీరో హీరోయిన్స్ గా నటించగా షారుఖ్ ఖాన్ అలాగే కింగ్ నాగార్జున లాంటి బిగ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో ఈ చిత్రంలో నటించారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి కొనసాగింపుగా అనౌన్స్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 2 పై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఆ సినిమాలో అయితే మరింత మంది బిగ్ స్టార్స్ పేర్లు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అలా ఇప్పుడు అయితే ఆ సినిమాలో కీలక పాత్రకి గాను కన్నడ రాకింగ్ స్టార్, ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కేజీయఫ్’ హీరో యష్ నటించనున్నాడని క్రేజీ బజ్ బయటకి వచ్చింది.

అయితే ఈ చిత్రం లో యష్ ఉన్నాడా లేదా అనే అంశంపై నిర్మాత కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. తాను లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ చేసాడు. తాము దేవ్ పాత్ర కోసం ఎవరినీ ఇంకా సంప్రదించలేదని ఇవన్నీ అవాస్తవం అని కన్ఫర్మ్ చేసాడు. మరి దీనిపై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు