కార్తీ “ఆవారా” సీక్వెల్ పై లేటెస్ట్ బజ్!

Published on Jun 6, 2023 3:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా, డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ పయ్యా. తెలుగు లో ఆవారా గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2010 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రం కి సంబంధించిన సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సీక్వెల్ కోసం హీరో ఆర్య ను అనుకున్నట్లు సమాచారం. అయితే హీరో కార్తీ తోనే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :