క్రేజీ బజ్..”కేజీయఫ్ 2″ నుంచి బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఈ డేట్ కి.!

Published on Nov 18, 2021 3:42 pm IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. పాన్ ఇండియన్ లెవెల్లో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అలాంటి ఈ సినిమా రిలీజ్ కి ఇంకా టైం కూడా కాస్త తక్కువే ఉంది.

మరి ఈ గ్యాప్ లో మేకర్స్ అప్డేట్స్ ఇచ్చే సమయం కూడా ఆరంభం కానుంది. అయితే ఇది ఓ బిగ్ అప్డేట్ తో స్టార్ట్ కానున్నట్టు క్రేజీ బజ్ వినిపిస్తుంది. హీరో యష్ లాస్ట్ బర్త్ డే కి అదిరే టీజర్ కట్ ని లాంచ్ చెయ్యగా దానికి ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి రాని రెస్పాన్స్ వచ్చింది.

ఇక నెక్స్ట్ బర్త్ డే కే అంటే మళ్ళీ జనవరి 8కి ఈ చిత్రం నుంచి సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈ క్రేజీ బజ్ ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :

More