“మహేష్ 28” బిజినెస్ పై క్రేజీ బజ్.!

Published on Mar 19, 2023 3:06 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా కోసం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ తో హ్యాట్రిక్ సినిమా చేస్తుండగా దీనిపై క్రేజీ హైప్ అయితే నెలకొంది. మరి ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పుడు స్వింగ్ లో జరుగుతూ ఉండగా సినిమా రిలీజ్ మరియు బిజినెస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ అయితే తెలుస్తుంది.

ఆల్రెడీ సినిమా ఓటిటి హక్కులు మరియు ఓవర్సీస్ హక్కులు రికార్డు ధరకి అమ్ముడుపోగా ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా తాలూకా బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే అసలు ఎలాంటి ఫస్ట్ లుక్ టైటిల్ కూడా లేకుండా సినిమా రికార్డు బిజినెస్ అవ్వగొట్టేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటెర్టైనెంట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :