క్రేజీ బజ్..మెగాస్టార్ మాస్ ప్రాజెక్ట్ లో ఈ మాస్ హీరో..?

Published on Dec 14, 2021 6:43 pm IST


మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అది కూడా ఏకకాలంలో ఒక్కోటి డిఫరెంట్ లుక్ తో మెగాస్టార్ ఎంతో డెడికేటెడ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు బాబీ తో చేస్తున్న క్రేజీ మాస్ మసాలా డ్రామా కూడా ఒకటి. భారీ అంచనాలు ఈ సినిమాపై ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పాలి. మళ్ళీ వింటేజ్ లుక్ లో బాస్ ని ప్రెజెంట్ చేస్తుండడంతో ఈ సినిమాపై చాలా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇపుడు ఇంకో క్రేజీ బజ్ వైరల్ అవుతుంది. దీని ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు ఇంకో మాస్ హీరో స్క్రీన్ పంచుకోనున్నాడట. అతడి మరెవరో మాస్ మహారాజ్ రవితేజ అని గత కొన్ని రోజులు నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇది వరకే ఈ క్రేజీ కాంబో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ బజ్ మొదలైంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :