మురుగదాస్ నెక్స్ట్ పై క్రేజీ బజ్.!

మురుగదాస్ నెక్స్ట్ పై క్రేజీ బజ్.!

Published on Dec 10, 2022 5:00 PM IST

సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ దర్శకుల్లో ఏ ఆర్ మురుగదాస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు అయితే మురుగదాస్ కొత్త సినిమా ఏది అనౌన్స్ చెయ్యలేదు. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా మంది స్టార్ హీరోల పేర్లు బయటకి వచ్చాయి కానీ ఫైనల్ గా మాత్రం ఇప్పుడు తమిళ్ హీరో శింబు తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తాను చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి.

మరి ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ వారితో చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం కూడా ఓ యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంపై అయితే రానున్న రోజుల్లో మరింత సమాచారం రావాల్సి ఉంది. లాస్ట్ టైం అయితే మురుగదాస్ సూపర్ స్టార్ రజిని తో “దర్బార్” చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు