క్రేజీ బజ్..నెక్స్ట్ ఊహించని డైరెక్టర్ తో నానీ సినిమా..?

Published on May 23, 2022 12:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ లైనప్ లతో వస్తున్నాడు. రీసెంట్ గా “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో హిట్ అందుకొని ఇప్పుడు “అంటే సుందరానికి” తో సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత “దసరా” తో కూడా సిద్ధంగా ఉన్నాడు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు నాని లైనప్ పై ఒక క్రేజీ ఊహించని రూమర్ బయటకి వచ్చింది. ఈ సినిమాలు తర్వాత ఇంకో ఒకటి లేదా సినిమాలు చేసాక ఒక సెన్సేషనల్ దర్సకుడితో సినిమా చేస్తున్నాడని రూమర్ వినిపిస్తుంది. మరి ఆ దర్శకుడు ఎవరో కాదట పాన్ ఇండియా సినిమా దగ్గర ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అట.

అది కూడా ఈ సినిమాని హోంబలే ప్రొడక్షన్ హౌస్ వారే నిర్మాణం అందిస్తారట. ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఇప్పుడు ఈ ఊహించని కాంబోపై రూమర్స్ మంచి వైరల్ గా మారాయి. మరి దీనిపై క్లారిటీ కాలమే డిసైడ్ చెయ్యాలి.

సంబంధిత సమాచారం :