“ఎన్టీఆర్ 30” పై క్రేజీ బజ్.!

Published on Feb 8, 2023 6:05 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హైప్ నెలకొనగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో అయితే జరుగుతున్నాయి. మరి ఇంకా క్యాస్టింగ్ పరంగా ఫైనల్ కావాల్సి ఉన్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా క్రేజీ బజ్ అయితే సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే ఈ సినిమాని పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా చెక్కేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

అందులో భాగంగానే తమిళ్ నుంచి చియాన్ విక్రమ్ అలాగే హిందీ నుంచి సైఫ్ అలీ ఖాన్ లాంటి వారై పేర్లు విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు కానీ జస్ట్ టాక్ సినిమాపై హైప్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాకి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :