టాక్..”భవదీయుడు భగత్ సింగ్” కి విలన్ గా ఈ వెర్సిటైల్ నటుడి పేరు?

టాక్..”భవదీయుడు భగత్ సింగ్” కి విలన్ గా ఈ వెర్సిటైల్ నటుడి పేరు?

Published on Jan 18, 2022 7:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి “భీమ్లా నాయక్” కాగా మరొకటి భారీ చిత్రం “హరిహర వీరమల్లు”. మరి ఈ రెండు సినిమాలపై కూడా ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ తర్వాత పవన్ మరిన్ని ఆసక్తికర సినిమాలు లైన్ లో పెట్టారు. మరి వాటిలో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సాలిడ్ సబ్జెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి.

అయితే ఈ చిత్రంపైనే ఒక క్రేజీ బజ్ ఒకటి వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ భారీ సినిమాలో విలన్ గా సౌత్ ఇండియా ప్రముఖ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నాడట. మరి ఆల్రెడీ విజయ్ విలన్ గా కనిపించి ఏ రేంజ్ లో కిక్ ఇచ్చాడో చూసాం. ఇక పవన్ సినిమాలో విలన్ గా అంటే ఆ హై ఇంకో లెవెల్లో ఉంటుంది. మరి వేచి చూడాలి. ఇందులో ఎంతమేర నిజముందో అనేది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు