“భవదీయుడు భగత్ సింగ్” రిలీజ్ పై క్రేజీ బజ్.!

Published on Apr 9, 2022 7:36 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా అయితే వాటిలో భారీ సినిమా “హరిహర వీరమల్లు” షూటింగ్ లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమా షూట్ టైం లోనే తన మరో క్రేజీ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్” చిత్ర యూనిట్ కనిపించి ఆశ్చర్యపరిచారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాని వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి అంతే త్వరగా ఫినిష్ చేసి పవన్ మరియు హరీష్ శంకర్ లకి హిట్ టైం అయినటువంటి వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు ఫిక్స్ చేశారట. అంటే గత పదేళ్ల కితం “గబ్బర్ సింగ్” తో వేసవిలో ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టారో మళ్ళీ ఇప్పుడు 2023 వేసవిలో ఆ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంతమేర నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :