ప్రభాస్ మాస్ తుఫాన్..”సలార్” రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ ఇదే.!

Published on Jun 14, 2022 4:05 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న క్రేజీ మాస్ చిత్రం “సలార్” కూడా ఒకటి. ప్రభాస్ నుంచి ఒక సరైన మాస్ సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో పాన్ ఇండియా సినిమా చూస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా విషయంలో సాలిడ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అయితే ఈ చిత్రం రిలీజ్ ఈ ఏడాదిలోనే అన్ని పరిస్థితులు బాగుండి ఉంటే ఉండేది. కానీ కోవిడ్ వల్ల ఇది జరగ లేదు. కానీ ఇప్పుడు అయితే ఒక క్రేజీ బజ్ ఈ చిత్రం రిలీజ్ పై వినిపిస్తుంది. దీని ప్రకారం మళ్ళీ పాత డేట్ కే వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. అంటే ఫస్ట్ రిలీజ్ కి ఏడాది గ్యాప్ రావాల్సి వచ్చింది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :