షారుఖ్, అట్లీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్.!

Published on Aug 5, 2021 5:02 pm IST


ఇండియన్ సినిమా దగ్గర సెట్టయిన పలు క్రేజీ కాంబినేషన్స్ లో సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు అట్లీ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ల కాంబో కూడా ఒకటి. ఈ కాంబో అనౌన్సమెంట్స్ నుంచే భారీ హైప్ ని నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది.

ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక అప్డేట్ ను వచ్చే ఆగస్ట్ 15న వదలనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఒక అదిరే ఇంట్రడక్షన్ టీజర్ కట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రంలో షారుఖ్ డబుల్ రోల్ నటిస్తున్నాడని అంతే కాకుండా స్టార్ హీరోయిన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని టాక్ ఉంది. మరి వేచి చూడాలి ఏం జరగనుందో..

సంబంధిత సమాచారం :