చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్.!

Published on Oct 8, 2021 6:51 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఐకానిక్ దర్శకుడు ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు స్టార్ట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి మొన్న సినిమా ముహూర్తం వరకు అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో స్ట్రాంగ్ కాస్టింగ్ పెట్టుకున్న శంకర్ ఒక్కొక్కరికీ ఒక్కో ఇంట్రెస్టింగ్ పాత్రని డిజైన్ చేశారు.

అలా చరణ్ రోల్ పై ఇప్పుడు మరో క్రేజీ బజ్ బయటకి వచ్చింది. మరి దీని ప్రకారం ఈ చిత్రం చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. అయితే అయితే అది డ్యూయల్ రోల్ నా లేక రెండు షేడ్స్ నా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మొత్తానికి మాత్రం సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో మెరవనున్నాడని ఓ స్ట్రాంగ్ బజ్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఇది ఎంత మేర నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :