క్రేజీ బజ్..బాలయ్య కోసం మరోసారి పవర్ స్టార్.?

క్రేజీ బజ్..బాలయ్య కోసం మరోసారి పవర్ స్టార్.?

Published on Dec 25, 2022 11:04 AM IST

రీసెంట్ గానే మన టాలీవుడ్ కి చెందిన బిగ్ స్టార్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలిసి “వీరసింహా రెడ్డి” సెట్స్ లో కనిపించడం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ కలయికకు ముందే ఆహా లో ప్రసారం అవుతున్న పాపులర్ టాక్ షో బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో పవన్ హాజరు కావడం అనేది కూడా ఖరారు అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఏ సెన్సేషనల్ కాంబినేషన్ పై మరో లేటెస్ట్ బజ్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు బాలయ్య నటిస్తున్న వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకి గాని పవర్ స్టార్ ఛీఫ్ గెస్ట్ గా రానున్నారని కొన్ని రూమర్స్ అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇదే కానీ నిజం అయితే ఆరోజు వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక అనౌన్సమెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా జనవరి 12 న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు