క్రేజీ బజ్ : దళపతి కోసం ఉస్తాద్..?

క్రేజీ బజ్ : దళపతి కోసం ఉస్తాద్..?

Published on Dec 15, 2022 12:01 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లితో “వారిసు” అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండగా అంచనాలు కూడా మరింత స్థాయికి వెళ్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా ఎంతగానో అలరించగా తమిళ్లో సినిమా గ్రాండ్ ఆడియో లాంచ్ ఎప్పుడు అనేది కూడా ఆసక్తిగా మారింది.

ఇక ఇప్పుడు తెలుగు ఆడియో ఫంక్షన్ కి సంబంధించి ఇప్పుడు ఓ క్రేజీ బజ్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి తెలుగుకి గాని ఈ సినిమా వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్టుగా కొన్ని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనితో అయితే ఈ అనధికారిక అప్డేట్ తో విజయ్ మరియు పవన్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే ఇదే కానీ నిజం అయితే తెలుగులో వారసుడు కి బిగ్ ప్లస్ కూడా చెప్పొచ్చు. కానీ ఈ టాక్ ఎంతవరకు నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు