క్రేజీ బజ్ : కిరణ్ అబ్బవరం కోసం పవర్ స్టార్?

Published on Sep 18, 2023 10:00 pm IST

ప్రస్తుతం రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన చిత్రం “రూల్స్ రంజన్”. మరి ఈ ఎంటర్టైనర్ ట్రైలర్ తో మంచి బజ్ ని తెచ్చుకోగా ఈ సినిమా విషయంలో అయితే ఓ క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని మేకర్స్ అక్టోబర్ లోకి షిఫ్ట్ చేయగా మరి ఈ గ్యాప్ లో సినిమాకి నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే పవర్ స్టార్ ని మేకర్స్ తీసుకు వచ్చే ఛాన్స్ ఉందని గట్టి బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఇది కానీ నిజం అయితే సినిమాకి పెద్ద బూస్టప్ అనే చెప్పాలి. కిరణ్ కూడా పవన్ కి పెద్ద అభిమాని అందరికీ తెలిసిందే. మరి తన ఈవెంట్ కి పవన్ వస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :