క్రేజీ బజ్ : “కాంతారా” దర్శకునితో మెగా పవర్.!

క్రేజీ బజ్ : “కాంతారా” దర్శకునితో మెగా పవర్.!

Published on Oct 23, 2022 4:40 PM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో తన కెరీర్ లో 15వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ లాస్ట్ కి వస్తుండగా కొంచెం గ్యాప్ లో చరణ్ అయితే ఇప్పుడు తన లాస్ట్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రమోషన్స్ నిమిత్తం జపాన్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి అయితే చరణ్ లైనప్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తూ ఉండగా..

ఇప్పుడు మరో క్రేజీ బజ్ అయితే తన లైనప్ పై వినిపిస్తుంది. లేటెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ కాంతారా దర్శకుడు అలాగే హీరో రిషబ్ శెట్టి తో చరణ్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. మరి ఇంకా ఈ కాంబోలో స్టోరీ నరేషన్ జరగాల్సి ఉండగా అందులో గ్రీన్ సిగ్నల్ గాని చరణ్ నుంచి వస్తే ఈ క్రేజీయెస్ట్ కాంబో రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి దీనిపై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు