క్రేజీ బజ్ : ‘సలార్’ ఇక సమ్మర్ కే ?

Published on Sep 23, 2023 1:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ పై అందరిలో రోజు రోజుకు అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న సలార్ కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వలన కొన్నాళ్ల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.

అయితే తాజా టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఇక ఈ ఏడాదిలో సలార్ రాక లేనట్లే అని, అలానే ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ లో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :